
ఆ ఎస్‌ఐ నమ్మించి.. మోసగించాడు
బనశంకరి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సబ్ ఇన్స్‌పెక్టర్ పేరు సునీల్. మంచి ఉద్యోగం, ఆదాయంతో జీవితం సాగుతోంది, కానీ తనను ప్రలోభపెట్టి మోసం చేశాడని ఓ మహిళ మీడియా ముందు గోడు వెళ్లబోసుకోవడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ మేరకు ఎస్‌ఐ హెచ్‌బీ సునీల్ పై బెంగళూరు డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయన పనిచేసేది కూడా అదే ఠాణాలో కావడం విశేషం.
ఇంటికి, హోటల్‌కు పిలిపించి
వివరాలు ఇలా ఉన్నాయి... పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కొనిస్తాను, బ్యూటీపార్లర్ పెట్టిస్తా, నీ జీవితాన్ని సెటిల్ చేస్తా అని తీయని మాటలతో మభ్యపెట్టాడు, లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. డీజే హళ్లి 8వ మైల్‌లో ఇల్లు, హోటల్‌కు పిలిపించుకుని రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికై నా చెబితే హత్యచేస్తానని బెదిరించాడని పేర్కొంది. అంతేగాక తన ప్రైవేటు ఫోటోలు, వీడియో పెట్టుకుని బెదిరిస్తున్నాడంది. తాను బ్యూటిషియన్‌గా పనిచేస్తానని, ఏడాదిన్నర కిందట ఓ సారి పనిమీద ఎస్‌ఐని కలిశానని, అప్పటినుంచి లోబర్చుకున్నాడని చెప్పింది. తమ వాట్సాప్ చాటింగ్‌లను చూపింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తిరస్కరించాడని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఫిర్యాదు మేరకు ఆ ఎస్‌ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐపై ఆమె డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు చేసింది.
బెంగళూరు డీజే హళ్లి ఎస్‌ఐపై
అదే ఠాణాలో మహిళ ఫిర్యాదు