నీట మునిగిన వరి పంట
హొసపేటె: బురదమయంగా మారిన ఏపీఎంసీ మార్కెట్ ఆవరణ
రాయచూరు రూరల్: జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. జిల్లాలో 52 మి.మీ వర్షపాతం నమోదైంది. రహదారులు బురదమయంగా మారాయి. మూన్నూరు వాడి, గాంధీ చౌక్, మహవీర చౌక్, కూరగాయల మార్కెట్‌లోకి వర్షపు నీరు చేరింది. తీన్ కందిల్ రాతి ఏనుగు విగ్రహం వద్ద మురుగు నిలిచింది. అరబ్ మెహల్లా, షియాత లాబలో, ఖాదర్ గుండా, నవాబ్ గడ్డలో నీరు చేరింది. మహరాష్ట్ర పైభాగంలో కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాలో కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీరు ప్రవహించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉజ్జయిని, సీనా, బోరి వాగుల నుంచి నీరు రావడంతో భీమా నది నుంచి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ సూచించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణలో ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరింది.
రోడ్డు బురదమయం
హొసపేటె: నగరంలో జోరువాన కురవడంతో ప్రముఖ ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారింది. మార్కెట్ మొత్తం రచ్చరచ్చగా ఉండటంతో అడుగు తీసి బయట వేయలేని పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు బురదలోని కూర్చొని కూరగాయలు విక్రయించారు. మార్కెట్‌లో అపరిశుభ్రత పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. మార్కెట్ వచ్చే వారు ముక్కు మూసుకొని కూరగాయలు కొన్నారు. మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నీటిలో నడుస్తున్న కూరగాయల వ్యాపారి
ఇళ్లలో చేరిన మురికి నీరు
రాయచూరులో కాలనీలు జలమయం
భీమా నది నుంచి దిగువకు నీరు విడుదల
కొనసాగుతున్న భారీ వర్షాలు
కొనసాగుతున్న భారీ వర్షాలు
కొనసాగుతున్న భారీ వర్షాలు
కొనసాగుతున్న భారీ వర్షాలు