
నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప
హొసపేటె: స్థానిక కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఏ నటరాజ ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చట్టం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కే.పాటిల్, రక్షణ, మైనార్టీ సంక్షేమ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జేఎం అనిల్ కుమార్ కే.కొట్రేశ్వర రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి బళ్లారిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కేజీ.శాంతి అధ్యక్షత వహిస్తారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగరంలోని వార్డుల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని మాజీ నగర సభ అధ్యక్షురాలు లలిత పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 14వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేదలకు ఇళ్లు కేటాయించాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భూమి పంపిణీ చేసి, ఇళ్లు కేటాయించాలని ఎస్టీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ గజాననకు వినతిపత్రం సమర్పించారు.
స్వచ్ఛత అభియాన్‌కు శ్రీకారం
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు స్వచ్ఛతకు చేతులు జోడించాలని యాదగిరి నగర సభ అధ్యక్షురాలు లలిత అనపూర్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో స్వచ్ఛత అభియాన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వేయడవ ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నట్లు పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. నగరంలో ఐదు రోజుల పాటు చేపట్టనున్న శ్రమదానంలో అందరూ పాల్గొనాలని సూచించారు.
జనగణన సహాయవాణి ఏర్పాటు
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక విద్య స్థితిగతులపై వివరాలు తెలియజేసేందుకు బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో సహయవాణి (ఫోన్ నంబర్) ఏర్పాటు చేశారు. 08062447961 నంబర్‌కు ఫోన్ చేయాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో సూచించారు.

నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప

నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప

నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప