
ఎడతెరిపి లేని వర్షాలు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. కల్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో భారీ వర్షాలకు అక్కడక్కడా సుమారు 100 ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నేలకొరిగాయి. దేవదుర్గ బస్టాండ్‌లో నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సేడం తాలూకా మళఖేడా జయతీర్థ ఆలయంలోకి నీరు చేరాయి. యాదగిరి తాలూకా దోరణహళ్లి వంతెన తెగడంతో యాదగిరి, రాయచూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కాగిణా నదిలో నీరు అధికంగా ప్రవహించడంతో పగలపూర్ వంతెన పూర్తిగా నీట మునిగింది. వందలాది ఎకరాల్లో పెసలు, మినుములు, కంది, పత్తి పంటల్లోకి నీరు చేరాయి. వరద పరిస్థితులను గురుమఠకల్ శాసన సభ్యుడు శరణేగౌడ పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై తిరిగి రైతుల పరిిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
కల్యాణ కర్ణాటకలో కుండపోత
నీట మునిగిన పంట పొలాలు

ఎడతెరిపి లేని వర్షాలు