
అమ్మా.. అమానుషం
తుమకూరు, పావగడ: ఎంత కష్టం వచ్చిందో కానీ.. ముద్దులొలికే పసిపిల్లలను తల్లి తన చేతులతో చంపి, తనువు చాలించింది. భర్త, అత్త వేధింపులను తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడిన హృదయ విదారక దుర్ఘటన తుమకూరు జిల్లాలోని పావగడ తాలూకాలోని కడపలకెరె గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. సరిత (25), కుమారుడు పుష్విక్ (4), కూతురు యుక్తి (2) మృతులు.
ఏం జరిగిందంటే..
వివరాలు.. కడపలకెరె గ్రామానికి చెందిన సరితకు స్థానికుడు సంతోష్‌తో ఆరేళ్ల కిందట పెద్దలు పెళ్లి చేశారు. భర్త ప్యాసింజర్ ఆటోను నడుపుతుండగా, సరిత గృహిణి. ఆమె అత్త అంజమ్మ పట్టణం లో వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో డీ గ్రూప్ ఉద్యోగి గా పని చేస్తోంది. భర్త, అత్త కలిసి సరితను సూటిపోటి మాటలతో వేధించేవారని సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన సరిత ఇంటిలో ఎవరూ లేని సమయంలో.. కొడుకును కత్తితో గొంతుకోసి హతమార్చింది. తరువాత కూతురికి ఉరివేసి చంపి, ఆపై తాను ఉరికి వేలాడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధుగిరి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదం అలముకొంది.
పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య
తుమకూరు జిల్లాలో ఘోరం

అమ్మా.. అమానుషం

అమ్మా.. అమానుషం

అమ్మా.. అమానుషం