
కల్యాణ కర్ణాటక.. అభివృద్ధి నత్తనడక
రాయచూరు రూరల్: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో గతంలో హైదరాబాద్ కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో ఇతర ప్రాంతాలకు సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన మండలి పేరుకు మాత్రమే పరిమితమైంది. కల్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాలు వస్తాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కారులు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రతి ఏడాది రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను శాసన సభ్యులు రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు వినియోగించు కోవాల్సి ఉంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ప్రత్యేక కమీషనరేట్ కార్యాలయం ఏర్పాటు హుళక్కే అయింది. 66 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 1957 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం పాలన నుంచి విముక్తి కలిగింది. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 2001లో అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ హైదరాబాద్ కర్ణాటక డెవలప్‌మెంట్ బోర్డు(హెచ్‌కేడీబీ)ను స్థాపించి అభివృద్ధికి ప్రాముఖ్యత నిచ్చారు. మండలికి శాసన సభ్యుడు అధ్యక్షుడిగా కొనసాగుతారు.
నేడు కలబుర్గికి సీఎం ిసిద్దరామయ్య రాక
ముఖ్యమంత్రి ిసిద్దరామయ్య ఈనెల 17న కలబుర్గిలో జరిగే కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం సీఎం ముందుగా కలబుర్గిలో సర్దార్ వల్లబ్‌బాయి పటేల్ ప్రతిమకు పుష్పార్చన చేస్తారు. అనంతరం కలబుర్గి క్రీడా మైదానంలో కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు.
పేరు మారినా అభివృద్ధిలో మాత్రం వెనుకడుగే
ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల నిధుల కేటాయింపు
నేడు కలబుర్గిలో విమోచన దినోత్సవ వేడుక

కల్యాణ కర్ణాటక.. అభివృద్ధి నత్తనడక