
సాగని పనులతో సంచారం నరకప్రాయం
బళ్లారి రూరల్: నగరంలో రోడ్ల ఆధునికీకరణలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనులతో ఇటు జనసంచారం, అటువాహనాల రాకపోకలకు సంకటంగా మారింది. నిన్నటి వరకు రాజకుమార్ రోడ్డు, టవర్‌క్లాక్ పనులతో రాకపోకలు ఇబ్బంది ఉండేది. అది కాస్త పూర్తయ్యాక నగరవాసులు, వాహనదారులు ఊపిరి పీల్చుకొన్నారు. మరో పక్క సుధాక్రాస్ ఫ్‌లైఓవర్ పనులు సాగుతుండటంతో బీఎంసీఆర్‌సీ ఆస్పత్రి నుంచి ట్రామాకేర్ సెంటర్, టీబీ శానిటోరియం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లే రోగులకు కష్టతరంగా మారింది. ఇప్పుడు సిటీ కార్పొరేషన్, గాంధీభవన్, పాత బస్టాండు ముందు డ్రైనేజీ నవీకరణకు తవ్వకాలు మొదలు పెట్టారు. దీంతో ఇటు వైపు జనం అటు వైపు అటు వైపు జనం ఇటు వైపు వెళ్లే పరిస్థితి లేకపోయింది. కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్, కెనరా బ్యాంకు, ఎల్‌ఐసీ, సిటీ ఆసుపత్రి సిబ్బంది రోడ్డు వైపు రాలేక గంటల కొద్ది పడిగాపులు కాశారు. కనీసం గాడి దాటుకోవడానికి దారి కల్పించమని సంబంధిత కాంట్రాక్టర్‌కు వర్కర్లను అడిగినందుకు ఉద్యోగులపై దురసుగా మాట్లాడి గొడవకు దిగడం గమనార్హం. అయ్యా మా కార్యాలయాలకు వెళ్లి రావడానికి దారి కల్పించండని బస్టాండు వద్ద ఉన్న సిబ్బంది కోరుతున్నారు.
పాత బస్టాండు ముందు తవ్వకాలతో దారి బంద్
ఎక్కడి వారు అక్కడే గంటల కొద్ది నిలబడాల్సిందే

సాగని పనులతో సంచారం నరకప్రాయం