
రాజ్యాంగం ఆశయాలను కాపాడాలి
హొసపేటె: బాధ్యతాయుతమైన ప్రభుత్వాల ఏర్పాటుకు రాజ్యాంగం దోహదపడుతుందని డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి భారతీయుడు రాజ్యాంగ ఆశయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తరువాత ఆమె పచ్చజెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభమై జిల్లా ఇండోర్ స్టేడియం చేరుకుంది. జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా, హుడా చైర్మన్ ఇమామ్ నియాజీ, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, ఏఎస్పీ మంజునాథ్, డీడీపీఐ వెంకటేష్, రామచంద్రప్ప, డీడీపీయూ నాగరాజ్ హవల్దార్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ చిదానంద, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.ఏ. కాలె, బీఈఓ శేఖరప్ప హొరపేటె పాల్గొన్నారు.