
విజృంభించిన డెంగీ
రాయచూరు రూరల్: లింగసూగురు తాలుకా హలబావిలో డెంగీ వ్యాధి విజృంభించింది. 300 మందికి ఈ వ్యాధి సోకడంతో అనే హోసురు, ఈచినాళ, లింగసూగురు సర్కారీ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఆదివారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి (డీహెచ్‌ఓ) సూరేంద్ర బాబు గ్రామాన్ని సందర్శించారు. అధికారులు, పంచాయతీ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జ్వరాలు సోకుతున్నాయని తెలిపారు. గ్రామానికి రెండు అంబులెన్సలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాన్ని పర్యటించి ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులను అదేశించారు. తాలుకా స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించి మురికి కాలువలను శుభ్రం చేయించి పారిశుధ్యం మెరుగు పరచాలని డీహెచ్‌ఓ ఆదేశించారు. కాగా గ్రామస్థాయి అధికారుల నిర్లక్ష్యమే డెంగీ ప్రబలేందుకు కారణమని స్థానికులు డీహెచ్‌ఓకు వివరించారు.
హలబావిలో ఇంటింటా రోగులే

విజృంభించిన డెంగీ