
కట్టుకున్నోడిని కాటికి పంపాలని..
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్‌కూలర్‌ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నిద్రిస్తుండగా భార్య హత్యాయత్నం
విజయనగర జిల్లాలో దాష్టీకం

కట్టుకున్నోడిని కాటికి పంపాలని..