
సన్‌రూఫ్‌కు నో చెప్పండి
దొడ్డబళ్లాపురం: కారు సన్‌రూఫ్ లో విలాసంగా తలపెట్టి బయటకు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా? ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారా.., అయితే ప్రమాదాలు జరగడంతో పాటు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇటీవల యలహంక సమీపంలో విద్యారణ్యపురంలో ఓ బాలుడు కారు సన్‌రూఫ్ నుంచి తల బయటకుపెట్టి ప్రయాణిస్తుండగా బారియర్ తగిలి తల తీవ్ర గాయమై ఆస్పత్రిలో ఉన్నాడు. దీనిపై యలహంక ట్రాఫిక్ పోలీసులు బీఎన్‌ఎస్ చట్టం కింద సెక్షన్ 125(ఏ), 281 కింద సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
● సన్‌రూఫ్ కారణంగా నిర్లక్ష్యం లేదా, అనుకోకుండా జరిగిన ఇలాంటి ప్రమాదం వల్ల గాయపడడం, ఇతరులకు ముప్పు కలిగితే బీఎన్‌ఎస్ 125 (ఏ)కింద మూడు నెలల వరకూ జైలు శిక్ష,రూ.2500 జరిమానా విధిస్తారు. అదే తీవ్ర గాయాలయితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, రూ.10వేల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
● బీఎన్‌ఎస్ సెక్షన్ 281 బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడాన్ని నిషేధించడం జరిగింది.
● ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే నెల రోజులు జైలు శిక్ష, రూ.1000లు జరిమానా విధించడం జరుగుతుంది.
● ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం సన్‌రూఫ్‌లో నిలబడడం చట్టరీత్యా నేరం, భద్రతకు కూడా మంచిది కాదు.
● సెక్షన 177, 184 కింద నేరంగా పరిగణిస్తారు. కాబట్టి సన్‌రూఫ్ నుంచి బయటకు వస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
లేదంటే ప్రమాదాలు, కేసులు తప్పవు
పోలీసులు, రవాణారంగ
నిపుణుల హెచ్చరిక