
ఐటీ సిటీలో రూ.1.5 కోట్ల డ్రగ్స్ సీజ్
బనశంకరి: ఐటీ సిటీలో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు విదేశీయులతో పాటు 9 మంది డ్రగ్స్ విక్రేతలను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామి లేఔట్, ఆవలహళ్లి, అమృతహళ్లి, హెబ్బగోడి, మైకో లేఔట్, రామమూర్తి నగర పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిసి వారిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 506 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, 50 ఎల్‌ఎస్‌డీ పట్టీలు, 85 గ్రాముల కొకై న్, కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కుమారస్వామి లేఔట్‌లో శాసీ్త్రనగరలో ఎల్‌ఎస్‌డీతో దొరకడం గమనార్హం. అలాగే ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్‌చేసి, కొకై న్‌ని సీజ్ చేశారు. హుడీలో బేకరి పెట్టుకుని డ్రగ్స్ అమ్ముతున్న కేరళ వాసిని అరెస్టు చేసి రూ.36 లక్షల విలువచేసే 300 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్ స్వాదీనం చేసుకున్నారు. హెబ్బగోడిలో మొబైల్ షోరూంలో పనిచేసే మరో కేరళ వాసి కూడా విలాసాల కోసం డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. వినాయక లేఔట్‌లో విదేశీ పౌరున్ని అరెస్టు చేశారు.
9 మంది పట్టివేత