
బోనులో అటవీ సిబ్బంది బందీ
మైసూరు: గత రెండు నెలలుగా తమకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న పులి, చిరుతలను బంధించడంలో విఫలమయ్యారంటూ ముఖ్య అటవీ అధికారి కార్యాలయ సిబ్బందిని బోనులో కట్టివేశారు గ్రామస్తులు. ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో అటవీ అధికారులు అచేతనులయ్యారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బొమ్మలాపురలో మంగళవారం జరిగింది.
వివరాలు..
కొంతకాలంగా చిరుతల దాడులతో పశువులను కోల్పోతున్న గ్రామస్తులు, రైతులు చిరుతలను బంధించాలని అటవీ అధికారులకు మొర పెట్టుకున్నారు. బొమ్మలాపుర గ్రామానికి చెందిన గంగప్ప పొలంలో బోను ఏర్పాటు చేశారు. గ్రామ శివార్లలో మళ్లీ చిరుతపులి మళ్లీ కనిపించిందంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో కోపోద్రిక్తులైన ప్రజలు, రైతులు కలిసి గార్డ్, వాచర్‌తో సహా ఏడుగురిని అదే బోనులో పెట్టి తాళం వేశారు. వెంటనే పులి, చిరుతల పట్టివేతకు చర్యలు చేపట్టాలని, లేకుంటే అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించి వారిని బోను నుంచి విడుదల చేశారు.
గ్రామస్తుల నిరసన చర్య