
బూటులో సర్పం.. ఆదమరిస్తే ప్రమాదం
శివమొగ్గ: చెప్పులు, బూట్లు వేసుకుంటున్నారా.. అయితే ఒక్క క్షణం వాటిలో ఏమైనా ఉన్నాయా అని పరిశీలించడం మంచిది. ఇటీవల బెంగళూరులో చెప్పులో దూరిన పాము కరిచి టెక్కీ మరణించడం తెలిసిందే. అదే మాదిరిగా ఇంటి చెప్పుల స్టాండ్‌లో షూలోకి పాము చేరిన ఘటన శివమొగ్గ నగరంలోని విద్యానగర కంట్రీ క్లబ్ రోడ్డులో జరిగింది. వివరాలు.. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని చెప్పుల స్టాండ్ వద్ద వదిలిన షూలోకి క్యాట్ స్నేక్ రకానికి చెందిన ఓ పాము చేరింది. అది చూసిన ఇంటివారు వెంటనే ఉరగ సంరక్షకుడు స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. కిరణ్ దానిని సురక్షితంగా బంధించారు. ఇది అరుదైన క్యాట్ స్నేక్ అని, విషరహిత వర్గానికి చెందినదని తెలిపారు. వర్షాకాలంలో పాములు ఇలా వెచ్చని చోటు కోసం వెదుక్కొని వస్తాయన్నారు. ఇంటి బయట వదిలిన షూలను వేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.
డిప్యూటీ సీఎం ఇంటిలో...
శివాజీనగర: బెంగళూరులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికారిక నివాసంలో శనివారం నాగుపాము పిల్ల కనిపించింది. కంగారు చెందిన సిబ్బంది తక్షణమే వన్యజీవి పరిరక్షకుడు ప్రసన్నకుమార్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి పాము పిల్లను పట్టుకున్నారు. ఈ సమయంలో డీకే ఆ ఇంటిలో లేరు.
శివమొగ్గలో మరో ఘటన

బూటులో సర్పం.. ఆదమరిస్తే ప్రమాదం