
ఫయాజ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
హుబ్లీ: నగరంలో జరిగిన నేహా హిరేమఠ హత్య కేసుకు సంబంధించి నిఽందితుడు ఫయాజ్ ధార్వాడ హైకోర్టు పీఠానికి సంబంధించి బెయిల్ పిటిషన్‌ను బుధవారం ఉపసంహరించుకున్నారు. బీవీబీ కళాశాల ఆవరణలో 2024 ఏప్రిల్ 18న నేహా హత్య జరగగా, ఈ కేసులో నిందితుడు ఫయాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫయాజ్‌కు బెయిల్ ఇవ్వడానికి హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ధార్వాడ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఫయాజ్ తరపున న్యాయవాదులు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటం ఆగదని, నిందితుడికి బెయిల్ దొరకకుండా పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.
మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా హేరూరు విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారంే హేరూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాశాల వద్ద చేపట్టిన ఆందోళన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపా నాయక్ మాట్లాడారు. హేరూరులో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవన్నారు. ఉన్న గదుల పైకప్పు పెచ్చులూడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సక్రమంగా భోజనాలు కూడా పెట్టడం లేదన్నారు.
గళగి హులకొప్ప పీడీఓ సస్పెండ్
హుబ్లీ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గళగి హులకొప్ప గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ) అబ్దుల్ రజాక్ మణియార్‌ను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ ఆదేశాలు వెల్లడించారు. ప్రభుత్వ నియమాలు, శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎన్నో ఖాతాల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు డబ్బు జమ చేసి విధుల్లో లోపానికి పాల్పడి, నిధులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చిన సీఈఓ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సమర్పించిన ప్రతిపాదనను పరిగణించి సస్పెండ్ చేశారు. కాగా సదరు బాధ్యుడు పైఅధికారుల ముందస్తు అనుమతి లేకుండా కేంద్ర స్థానం వదలరాదని ఆయన తమ ఆదేశాల్లో వెల్లడించారు.
గ్రామాల్లో అభివృద్ధి
పనులపై దృష్టి పెట్టండి
రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామాల్లో విధులు నిర్వహించే పంచాయతీ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ సూచించారు. జెడ్పీ సభాభవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారు(పీడీఓ)లకు సలహాలు అందించారు. తాగునీరు, స్వచ్ఛత, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు సమావేశానికి సరైన సమాచారం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో పంచాయతీ అధికారులపై ఫిర్యాదులు వస్తే అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసు కుంటామన్నారు. సమావేశంలో రోణ, శరణ బసవ, విజయ్ శంకర్‌లున్నారు.
కాంగ్రెస్‌వి రైతు వ్యతిరేక విధానాలు
కోలారు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, అందువల్లనే ఇటీవల జరిగిన వేమగల్– కురుగల్ పట్టణ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు జేడీఎస్–బీజేపీ మైత్రి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించడం ద్వారా పట్టణ పంచాయతీలో అధికారంలోకి తీసుకు వచ్చారని జేడీఎస్ నాయకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో తాలూకాలోని దొడ్డహసాళ ఏపీఎంసీ డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను అభినందించి మాట్లాడారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించి అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయిందన్నారు. దీని వల్ల ప్రజలు విసిగి పోయి కాంగ్రెస్‌ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఖజానా ఖాళీ అయి అభివృద్ధి పనులు కుంటు పడుతున్నాయన్నారు. పాల ఉత్పత్తిదారులకు ఇస్తున్న సహాయ ధనాన్ని కూడా తగ్గించిందన్నారు. ప్రభుత్వం దివాళా అంచునకు చేరడమే దీనికంతా కారణమన్నారు. కోలారు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో జరుగుతున్న గ్రూపు తగాదాల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. జేడీఎస్ జిల్లా కార్యాధ్యక్షుడు బణకనహళ్లి నటరాజ్, దింబ నాగరాజ్, టీపీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఫయాజ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

ఫయాజ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ