
స్వాగతం.. సుస్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మైసూరు ప్యాలెస్‌కు విచ్చేసిన దృశ్యం. ఆమెకు రాజవంశీకులు ప్రమోదాదేవి, యదువీర్ ఒడెయర్‌ల స్వాగతం
త్వరలో సంచలనాలు: సమీర్
దొడ్డబళ్లాపురం: ధర్మస్థల పుణ్యక్షేత్రంపై దుష్ప్రచారం చేస్తున్నాడనే కేసులో విచారణను ఎదుర్కొంటున్న యూట్యూబర్ బళ్లారి సమీర్ ధర్మస్థలంలో అస్థిపంజరాల గురించి సంచలన విషయాలు చెబుతానని అన్నాడు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన సమీర్ సిట్ నుంచి తనకు ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు రాలేదన్నాడు. బెళ్తంగడి పోలీసులు మాత్రమే నోటీసులు ఇచ్చారని, అందువల్ల విచారణకు వెళ్లానన్నారు. విదేశాల నుండి నీకు డబ్బులు వచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా, అని ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోనన్నాడు. ఇందులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నాడు. అనన్య భట్ గురించి త్వరలో తన యూట్యూబ్ చానల్‌లో పూర్తి సమాచారం ఇస్తానన్నాడు.
ఆస్పత్రుల్లో పౌష్టికాహార పంపిణీ
బనశంకరి: ప్రభుత్వాసుపత్రుల్లోని రోగులకు ఇస్కాన్ సంస్థచే పౌష్టికాహారం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. మంగళవారం ఇందిరానగరలోని సీవీ.రామన్‌నగర జనరల్ ఆసుపత్రిలో రోగులకు మంత్రి భోజనం అందించి ఈ పథకాన్ని ప్రారంభించారు. నగరంలో కేసీ.జనరల్ ఆసుపత్రి, జయనగర జనరల్ ఆసుపత్రి, సీవీ.రామన్‌నగర జనరల్ ఆసుపత్రుల్లో ఇస్కాన్ భోజనం లభిస్తుందని తెలిపారు. బాలింతలు, రోగులను బట్టి ఐదు రకాల పౌష్టికాహారం అందిస్తామన్నారు. బెళగావి, బళ్లారి, ధారవాడ, మైసూరులో కొన్ని ఆస్పత్రుల్లోనూప్రారంభిస్తామని చెప్పారు. గుండె చికిత్సల కోసం మంగళూరు, హొసకోటేలో కూడా క్యాథ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
రూ.కోట్లు వృథాయేనా?
దొడ్డబళ్లాపురం: హాసన్ తాలూకా అగిలె గ్రామం వద్ద మున్సిపల్ శాఖ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న చెత్త డంపింగ్ సెంటర్ మంగళవారంనాడు కుప్పకూలింది. షెడ్డులో కార్మికులు పని చేస్తుండగానే అది పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఇటీవలే కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. నాసిరకంగా నిర్మించడం వల్లే షెడ్ కూలినట్టు తెలుస్తోంది.
కూలిన బతుకులు
● పునాదులు పడి ఇద్దరు దుర్మరణం
యశవంతపుర: కట్టడ నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా మట్టి చరియలు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన బెంగళూరులోని యలహంకలో జరిగింది. కార్మికులు శివ (35), మధుసూదన్‌రెడ్డి (48)లు చనిపోయారు. సోమవారం సాయంత్రం ఎంబసీ గ్రూప్‌కు చెందిన భారీ భవనానికి కి పునాదులు తవ్వుతుండగా పెద్ద ప్రమాణంలో మట్టి, బుదర వారి మీద కూలిపోయింది. అందులో చిక్కుకుని శివ అక్కడే చనిపోగా, మధుసూదన్‌రెడ్డిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కొన్నిరోజుల నుంచి వర్షాలు రావడంతో మట్టి వదులుగా మారడమే కారణమని ఇతర కార్మికులు తెలిపారు. యలహంక పోలీసులు కట్టడ యజమానిపై కేసు నమోదు చేశారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి కూలీ పనులు చేసేవారు.
హోం మంత్రితో సిట్ చీఫ్ భేటీ
శివాజీనగర: ధర్మస్థల కేసుల గురించి తనిఖీ జరుపుతున్న సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి మంగళవారం హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ను కలిశారు. బెంగళూరు సదాశివనగరలో ఉన్న హోంమంత్రి ఇంటికి వెళ్లి భేటీ చేసిన ప్రణబ్ మొహంతి ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన అంశాలను వివరించారు. నిందితుడు చిన్నయ్య కుట్ర కోసం ఎక్కడెక్కడ పర్యటించాడు, ఎవరెవరిని కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం చేసినవారు ఎవరు తదితర సమాచారాన్ని తెలిపారు. కేసులో ప్రధాన బిందువైన పుర్రె గురించి సేకరించిన సమాచారాన్ని హోంమంత్రికి వివరించారని తెలిసింది.

స్వాగతం.. సుస్వాగతం

స్వాగతం.. సుస్వాగతం

స్వాగతం.. సుస్వాగతం

స్వాగతం.. సుస్వాగతం

స్వాగతం.. సుస్వాగతం