
చిరస్థాయిగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు
బనశంకరి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ ప్రదాత, అపర భగీరథుడు, బావితరాలకు దార్శనికుడు డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు అపారమని అభిమానులు కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతిని సిలికాన్ సిటీలో అభిమానులు, పార్టీ నాయకులు సేవా తత్పరతతో నిర్వహించారు. మంగళవారం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని సమర్థనం ట్రస్ట్‌లో డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బెంగళూరు అధ్యక్షుడు బోయిళ్ల రమణారెడ్డి, కార్యాధ్యక్షుడు బాబూరాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మహానేత వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్ తో కోట్లాదిమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపారని తెలిపారు. రైతుల కోసం ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందన్నారు. రైతు, మహిళా, విద్యార్థి, కార్మిక, కర్షక పక్షపాతిగా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత అన్నారు. జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక భారీ నీటిప్రాజెక్టులు నిర్మించిన ఘనత రాజశేఖర్‌రెడ్డి కే దక్కుతుందని తెలిపారు.
ఈ సందర్బంగా విద్యార్థులకు పండ్లు పంచి, అన్నదానం చేశారు. ముత్యాలనారాయణరెడ్డి, బీ.వెంకట్రామిరెడ్డి, కేఎల్.వెంకటరెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, కొండపరెడ్డి రమణారెడ్డి, పవన్, కల్లూరి పీరయ్య, చిన్నపీరయ్య, బుజ్జీ బ్రదర్స్ రమేశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
కొనియాడిన అభిమానులు
బెంగళూరులో మహా నేత వర్ధంతి కార్యక్రమాలు

చిరస్థాయిగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు

చిరస్థాయిగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు