
ఎరువుల కొరత తలెత్తనీయొద్దు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్
రాయచూరు రూరల్: రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పథకాల పనుల ప్రగతిపై జరిగిన కేడీపీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. విద్యుత్ మీటర్ లేదు, బిల్ కట్టలేదంటూ విద్యుత్ సరఫరాను కట్ చేయరాదన్నారు. అక్రమంగా ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో మల్లికార్జున గౌడ, జయంతిరావ్, పవన్ పాటిల్, అధికారులు సురేష్ వర్మ, శరణ బసవ, చంద్రశేఖర్, సభ్యులు పల్లవి, ఈరేశ, రామప్ప, శ్రావణి, తిమ్మప్ప, చెన్నబసవ నాయక్, ఫారూక్, జిలానిలున్నారు.
అధికారులకు గ్రామీణ ఎమ్మెల్యే
బసనగౌడ దద్దల్ సూచన

ఎరువుల కొరత తలెత్తనీయొద్దు