
మహమ్మద్ పైగంబర్ బోధనలపై అభియాన్
కోలారు : మహమ్మద్ పైగంబర్ బోధనలపై జిల్లా జమాతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 14 వరకు 10 రోజుల జన సందేశ అభియాన్‌ను నిర్వహిస్తామని జమాతె ఇస్లామి హింద్ మాజీ అధ్యక్షుడు ముబారక్ బాగ్దాన్ తెలిపారు. మంగళవారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. అభియాన్ సందర్భంగా విచార గోష్టులు, రక్తదాన శిబిరాలు, ప్రబంధ పోటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేస్తామన్నారు. మైనారిటీ సముదాయ ప్రముఖుడు అన్వర్ పాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త న్యాయ, మానవత సందేశాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలన్నారు. విలేకరుల సమావేశంలో జమాతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆలి, తాలూకా అధ్యక్షుడు అజ్మల్ ఖదీర్, కోశాధికారి రుహుల్లా బేగ్ పాల్గొన్నారు.