
ఎరువుల కోసం రైతన్న బారులు
రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని కలబుర్గి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, యాదగిరి, విజయ నగర, బాగల్‌కోట జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత అధికమైంది. సోమవారం కొప్పళలో రైతులు ఎరువుల దుకాణాల ముందు నిలబడినా ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీ కోసం 44 సహకార సంఘాల్లో రైతులు ఎదురు చూస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీకి 50 టన్నుల యూరియా వచ్చినట్లు వచ్చి రాగానే ఖాళీ అయింది. రాయచూరు జిల్లాకు 72 వేల మెట్రిక్ టన్నుల యారియా అవసరం కాగా కేవలం 900 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా లభించక పోవడంతో రైతులు వాటి కోసం వలస వెళుతున్నారు.
క.క.భాగంలో తీవ్రమైన
ఎరువుల కొరత
రైతులకు ఇబ్బందులు
కల్గిస్తున్న ఎరువులు