
గడియారం కోసం విద్యార్థుల గొడవ
సాక్షి బళ్లారి: నమ్మశక్యం కాని ఓ అమానుష ఘటన విజయపుర జిల్లాలో జరిగింది. ఈ దారుణం పలువురిని కలచివేసింది. గడియారం కోసం జరిగిన గొడవలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి విద్యార్థిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగర శివార్లలోని యోగాపురలో బిహార్‌కు చెందిన సునీల్, శృతి దంపతుల కుమారుడు హన్స్ అనే ఐదో తరగతి విద్యార్థిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు దాడి చేశారు. అక్కడి సత్యసాయిబాబా పాఠశాలలో చదువుతున్న హన్స్‌పై తోటి విద్యార్థులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు విద్యార్థులు హన్స్‌పై దారుణంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా విజయపురలో తీవ్ర కలకలం రేపింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పలువురు పాఠశాల గేటు ముందు విద్యార్థి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఐదో తరగతి విద్యార్థి దారుణ హత్య
విజయపుర జిల్లాలో పెను విషాదం