వ్యక్తిపై పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

Aug 5 2025 12:17 PM | Updated on Aug 5 2025 12:17 PM

వ్యక్

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

భర్తను నదిలోకి తోసిన కేసులో మలుపు

భర్త తాతప్పను అరెస్ట్‌ చేసిన పోలీసులు

రాయచూరు రూరల్‌: వంతెన పైనుంచి భర్తను ఓ భార్య నదిలోకి తోసిన కేసు కొత్త మలుపు తిరిగింది. రాయచూరు తాలూకాలోని గూర్జాపూర్‌ వంతెన వద్ద తన భార్యే తనను నదిలోకి తోసిందని శక్తినగర్‌కు చెందిన తాతప్ప ఆరోపించాడు. మూడు నెలల క్రితం యాదగిరి జిల్లా వడగేరకు చెందిన గెద్దెమ్మతో తాతప్పకు వివాహమైంది. అయితే విడాకుల కోసం కోర్టు మెట్లడానికి సిద్ధమైన తాతప్పపై బాల్య వివాహ చట్టం కింద పోక్సో కేసు నమోదు కావడంతో ఆదివారం శక్తినగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గుంతలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

హుబ్లీ: ముదగల్‌ సమీపంలోని హొనూరు గ్రామం వద్ద రోడ్డులోని గుంతలో అంకలిమఠ మంగళూరు మార్గంలో వెళుతున్న బస్సు ముందు చక్రాలు ఇరుక్కొని కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాక్టర్‌ సాయంతో స్థానికులు ఇరుక్కున్న బస్సును ముందుకు లాగించారు. పొరుగుల జిల్లాలను కలిపే ఈ రోడ్డు డ్రైనేజీ నీరు, వాన నీరు కలిసి మట్టి రోడ్డు బురదమయమై గుంతలు పడ్డాయి. తక్షణమే ప్రజాపనుల శాఖ అధికారులు సీసీ రోడ్డును నిర్మించి ప్రయాణికుల రాకపోకలకు అనుకూలం కల్పించాలని హొనూరు గ్రామస్తులు ఆర్‌టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

హాస్టల్‌ భవనం ప్రారంభమెన్నడో?

హొసపేటె: తాలూకాలోని జంబునాధ రోడ్డులో నాలుగు నెలల క్రితం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల్‌ కలాం మొరార్జీ దేశాయి వసతి కళాశాల, బాలికల హాస్టల్‌ భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోక పోవడం శోచనీయం. భవనాన్ని బాగా నిర్మించినా అశాసీ్త్రయంగా నిర్మాణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌, కళాశాలను కర్ణాటక హౌసింగ్‌ బోర్డు రూ.8.5 కోట్ల ఖర్చుతో నిర్మించింది. కానీ ప్రారంభం కాకపోవడంతో భవనం నిరుపయోగంగా ఉంది. ఈనేపథ్యంలో సంబంధిత అధికారులు, పాలకులు హాస్టల్‌ భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ

హుబ్లీ: వివిధ జిల్లాల పాలిట ఆరోగ్య కామధేను కల్పవృక్షంగా వర్ధిల్లుతున్న కర్ణాటక మెడికల్‌ కళాశాల పరిశోధన కేంద్రం ఆవరణలో 50 పడకల అత్యవసర విభాగానికి సంబంధించిన ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి హుబ్లీ ధార్వాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేష్‌ టెంగినకాయి సదరు ఆవరణలో సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధార్వాడ ఎంపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరుల సహాయ సహకారాలతో కేఎంసీ ఆస్పత్రిలో రోగులకు అన్ని వసతులు కల్పించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని నిధులు కేటాయించి ఈ ఆస్పత్రిని అత్యాధునిక సేవలతో అలరాలేలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు.

ఇళ్లలో చోరీలు..

నిందితుని అరెస్టు

కోలారు: 2018లో కోలారు నగరంలోని 8 ఇళ్లలో జరిగిన దొంగతనం కేసులకు సంబంధించి నిందితుడిని కోలారు నగర పోలీసులు అరెస్టు చేశారు. హాసన జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన సంతోష్‌ అలియాస్‌ ఐపీఎల్‌ సంతోష్‌(38) పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు. ఇతనిపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. నిందితుడి ఆచూకీ కోసం డీఎస్పీ నాగ్తె నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించారు. నిందితుడిని హాసన జిల్లా సకలేశపుర– బెంగళూరు బైపాస్‌ వద్ద అరెస్టు చేసి కోలారుకు తీసుకొచ్చి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

ఆరోగ్య శిబిరం లబ్ధి పొందాలి

కోలారు: ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగరసభ సభ్యుడు సమీవుల్లా తెలిపారు. సోమవారం నగరంలోని చిక్కబళ్లాపురం రోడ్డులో ట్రూకేర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. తాము ఇప్పటికే గత 6 ఏళ్లుగా అనేక ఉచిత ఆరోగ్య శిబిరాలను, పలు జనపర కార్యక్రమాలను నగరంలో నిర్వహించినట్లు తెలిపారు. ట్రూకేర్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సకై ్లన్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. కాగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్‌డీపీఐ కార్యకర్తలు ఆరోగ్య శిబిరంపై ఇంటింటా ప్రచారం చేశారు.

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు1
1/3

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు2
2/3

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు3
3/3

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement