
ప్రేమ వ్యవహారానికి యువకుడు బలి
హొసపేటె: ముస్లిం అమ్మాయిని ప్రేమించిన హిందూ యువకుడు గవిసిద్దప్ప నాయక్‌ను కొప్పళ నగరంలోని 3వ వార్డులోని మసీదు ముందు ముస్లిం యువకుడు సాదిక్ కోల్కర్ హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గవిసిద్దప్పను హత్య చేసిన సాదిక్ ఆదివారం రాత్రి నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గవిసిద్దప్ప గత రెండేళ్లుగా గౌరీ అంగళ ప్రాంతానికి చెందిన మైనర్ ముస్లిం బాలికను ప్రేమించి ఆమెతో ఇంటి నుంచి పరారయ్యాడు. వీరి ప్రేమ విషయంపై నాలుగైదు సార్లు పంచాయతీలు జరిగాయి. అయితే గవిసిద్దప్ప, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కొనసాగింది. గవిసిద్దప్ప ప్రేమించిన యువతిని సాదిక్ కూడా ప్రేమించాడు. సాదిక్‌తో ప్రేమ బంధాన్ని తెంచుకున్న యువతి గవిసిద్దప్పను ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న సాదిక్ గవిసిద్దప్పతో చాలా సార్లు గొడవపడ్డాడు. ఈ విషయం తీవ్రస్థాయికి చేరుకుంది.
పక్కా ప్రణాళికతో హత్య
ఈ క్రమంలో గవిసిద్దప్పను హత్య చేయాలని సాదిక్ పథకం వేశాడు. బహదూర్‌బండి నుంచి బైక్‌పై వస్తున్న వస్తున్న గవిసిద్దప్పను మసీదు సమీపంలో గొంతు కోసి, మెడపై కొడవలితో నరికి చంపారు. ఎస్పీ డాక్టర్ రామ్ అరసిద్ది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు ముస్లిం యువకులు గవిసిద్దప్పను హత్య చేశారని చెబుతున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం హత్యకు ముందు సాదిక్ ఒక కత్తిని తీసుకొని దాన్ని రీల్ చేసి బిల్డప్ ఇచ్చాడు. అతను తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక స్టేటస్ పెట్టాడు. రాత్రి 7.30 గంటలకు గవిసిద్దప్పను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు గవిసిద్దప్ప నాయక్ తండ్రి నింగజప్ప టణకనల్ ఫిర్యాదు మేరకు నిందితుడు సాదిక్‌తో పాటు మరో నలుగురిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాదిక్ అరెస్టు కాగా మిగతా నలుగురి పట్టివేతకు కొప్పళ రూరల్ పోలీసులు గాలింపు చేపట్టారు.
గవిసిద్దప్పకు రాఖీలు కట్టి వీడ్కోలు
కాగా హత్యకు గురైన గవిసిద్దప్ప నాయక్‌పై పుట్టెడు దుఃఖంలోనూ సోదరీమణులు తమ సోదర ప్రేమను చూపారు. అవును... రక్షా బంధన్ సందర్భంగా వారు మరణించిన గవిసిద్దప్ప చేతికి రాఖీలు కట్టారు. పీకల్లోతు దుఃఖంలోనూ వారు తమ సోదరుడికి రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు పలికారు.
ముస్లిం యువతిని ప్రేమించిన
హిందూ యువకుడి హత్య
కొప్పళ నగరంలో ఘటన,
పరారీలో నలుగురు నిందితులు

ప్రేమ వ్యవహారానికి యువకుడు బలి