సరుకు రవాణాలో నైరుతి రైల్వే జోరు | - | Sakshi
Sakshi News home page

సరుకు రవాణాలో నైరుతి రైల్వే జోరు

Aug 5 2025 12:15 PM | Updated on Aug 5 2025 12:15 PM

సరుకు రవాణాలో నైరుతి రైల్వే జోరు

సరుకు రవాణాలో నైరుతి రైల్వే జోరు

హుబ్లీ: 2025–26వ ఆర్థిక సంవత్సరానికి గాను తొలి నాలుగు నెలల్లో నైరుతి రైల్వే జోన్‌ సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాతో కలిపి మొత్తం మీద ఆదాయార్జనలో రెండింటిలోను అద్వితీయమైన రికార్డు సాధించింది. ఇది కార్యాచరణ శ్రేష్టత, వినియోగదారుల ఆధారిత సాంకేతిక అంశాలపై నిరంతరం దృష్టి ప్రతిబింబిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. గత ఏప్రిల్‌ నుంచి జూలై 2025 వరకు జోన్‌ మొత్తం మీద 16.27 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇదే అవధిలో 14.05 మిలియన్‌ టన్నుల కన్నా 15.08 శాతం ఎక్కువ. ఈ 2.22 మిలియన్‌ టన్నుల పెరుగుదల నైరుతి రైల్వే తన సేవలను మరింత పెరుగుపరుచుకోవడంతో పాటు ప్రముఖ పరిశ్రమలతో ఉత్తమ సంబంధాలను సాధించడానికి నిదర్శనం. రవాణా చేసిన ప్రముఖ సరుకుల్లో ముడి ఇనుము 6.41 మిలియన్‌ టన్నుల లోడింగ్‌తో తొలి స్థానంలో ఉంది. ఇది గత ఏడాది 5.54 మిలియన్‌ టన్నుల కన్నా 15.08 కన్నా ఎక్కువ. ఉక్కు లోడింగ్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందగా 3.54 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ఇది 2.49 మిలియన్‌ టన్నుల నుంచి 42.10 టన్నులకు పెరిగింది. బొగ్గుల రవాణా కూడా 13.4 శాతం ఎక్కువగా 3.32 మిలియన్‌ టన్నులకు చేరుకుంది.

ఉక్కు యూనిట్లకు భారీగా సరుకు రవాణా

ఉక్కు ఉత్పత్తి యూనిట్లకు ముడి సరుకులను 0.47 మిలియన్‌ టన్నుల నుంచి 51.4 టన్నులకు పెరిగి 0.71 మిలియన్‌ టన్నులు అయింది. ఇలా పెరుగుదలలో తొలి స్థానం అక్రమించింది. రసాయనిక ఎరువుల లోడింగ్‌ కూడా 0.37 మిలియన్‌ టన్నుల నుంచి 12.6 శాతానికి పెరిగి 0.42 మిలియన్‌ టన్నులకు చేరింది. కంటైనర్‌ రవాణా ద్వారా 0.25 మిలియన్‌ టన్నుల నుంచి 29.4 శాతం పెరిగి 0.32 మిలియన్‌ టన్నులకు చేరింది. ఆదాయార్జన విషయంలో నైరుతి రైల్వే అన్ని ప్రముఖ ఆదాయ శ్రేణుల్లో మెరుగైన పెరుగుదలను నమోదు చేసింది. ప్రయాణికుల ఆదాయం రూ.1.64 కోట్లు కాగా గత ఏడాది గడువులో ప్రయాణించిన 55 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే ఈ ఏడాది 59 మిలియన్ల మంది ప్రయాణించారు. కోచింగ్‌ సేవల నుంచి పార్శిల్‌, అలాగే ఇతర ప్రయాణికుల సేవలు కలిపి రూ.113 కోట్లను గడించింది. ఇది గత ఏడాది 107 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఏడాది మంచి ప్రగతి సాధించిందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఆదాయార్జనలో సరికొత్త రికార్డు

ముడి ఇనుము లోడింగ్‌లో తొలి స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement