
8 నుంచి రాఘవేంద్ర స్వామి సప్త రథోత్సవాలు
రాయచూరు రూరల్: మంత్రాలయంలో ఈనెల 8 నుంచి 14 వరకు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ పేర్కొన్నారు. సోమవారం మంత్రాలయం మఠంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా 10న పూర్వారాధన, 11న మధ్యారాధన, 12న ఉత్తరాధన జరుగుతుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కేరళ, పాండిచ్చేరి నుంచి వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. మఠం అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. మంత్రాలయంలో జరిగే ఆరాధనోత్సవాలకు అన్ని విధాలుగా వసతులు సమకూర్చామన్నారు. కాగా ఇదే సందర్భంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డును ప్రదానం చేస్తామని ఆయన వెల్లడించారు. 10న జరగనున్న పూర్వారాధనలో ఉత్తరప్రదేష్ కాశీ పీఠం విద్వాంసుడు రాజారాం శుక్లా, తమిళనాడు విఠల్‌లకు ప్రదానం చేస్తామని తెలిపారు.