
కోర్టు తీర్పును గౌరవించాలి
మండ్య: న్యాయస్థానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రజ్వల్ రేవణ్ణ కేసులో తీర్పు గురించి మాజీ ఎంపీ సుమలత స్పందించారు. శుక్రవారం మండ్యలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాట్లాడేందుకు ఇంకేమీ లేదని, దోషి అని తేల్చడంతో అంతా ముగిసిందని అన్నారు. ఇక ఏ శిక్ష పడుతుందో చూడడమేనని అన్నారు. తనను కొందరు ఆన్‌లైన్ ట్రోల్, అసభ్యపదజాలంతో దూషించడం కొత్తేమీ కాదని, ఐదారేళ్ల నుంచి ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సామజిక మాధ్యమాల్లో జరిగిన ట్రోలింగ్‌పై కేఆర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, ఇప్పటివరకు చర్యలు లేవని వాపోయారు. ఆరోపణలు చేయడం అందరికీ చాలా సులభమని, నిరూపితం చేయాలంటే చాలా కష్టమని అన్నారు.