
ఘనంగా అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
శ్రీనివాసపురం : పట్టణ సమీపంలోని పుంగనూరు క్రాస్‌లో నూతనంగా ఏర్పాటు చేసినఅభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. లోకకళ్యాణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఆలయాన్ని రూ.15 కోట్లతో నిర్మిస్తుండగా ఇప్పటికే రూ. 10 కోట్ల మేర పనులు ముగిశాయన్నారు. ప్రతిష్టాపనా పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది.