
ఉత్తమ విద్యార్థులకు సత్కారం
రాయచూరు రూరల్ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలు తార్కాణం కావాలని కేఈబీ పాఠఽశాల హెడ్‌మాస్టర్ హీరాలాల్ పేర్కొన్నారు. శుక్రవారం మాదర చెన్నయ్య సభా భవనంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వదిలి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి స్వశక్తితో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్, రావుత్ రావ్, వీరేశ్, మారెప్ప, లోకేష్, మౌనేష్‌లున్నారు.