
అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
హొసపేటె: నాగ పంచమి రోజున ఓ భార్య తన అనైతిక సంబంధాన్ని వ్యతిరేకించిన భర్తను తన ప్రియుడి ద్వారా చంపించిన ఘటన వెలుగు చూసింది. వివరాలు.. ద్యామన్న హత్యకు గురైన భర్త. నిందితుడు, లారీ డ్రైవర్ అయిన ప్రియుడు శ్యామన్న కొప్పళ తాలూకాలోని కామనూరు నివాసి. నేత్రావతి, శ్యామన్న ఒకే గ్రామానికి చెందినవారు. నేత్రావతికి బూదగుంప గ్రామానికి చెందిన ద్యామన్నతో వివాహమైంది. భర్త తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆ మేరకు గతనెల 25న బూదగుంప సమీపంలోని గ్యారేజ్ నుంచి ఇనుప రాడ్‌ని తెచ్చిన శ్యామన్న మాయమాటలతో అతనిని తన సొంత పొలానికి పిలుచుకెళ్లి అక్కడ ఇనుప రాడ్‌తో ద్యామన్నను కొట్టి చంపాడు. ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్య తర్వాత ఇనుప రాడ్‌ను తిరిగి ఇచ్చేశాడు. తన భర్త చనిపోగా నేత్రావతి ఇంట్లో నాగపంచమి పండుగ చేసుకుంది. హత్య తర్వాత తన భర్త ధర్మస్థలకు వెళ్లాడని ఆమె తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పింది. ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి 5 రోజులు ఇంట్లోనే ఉంది. ఇంతలో ద్యామన్న సోదరులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మునిరాబాద్ పోలీసులు తమదైన శైలిలో చేపట్టిన విచారణలో నేత్రావతి తన భర్తను ప్రియుడు శ్యామన్నతో కలిసి హత్య చేయించిన విషయంపై నోరు విప్పింది. హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితులు నేత్రావతి, శ్యామన్నలను అరెస్టు చేశారు.
ప్రియుడితో కలిసి భర్తను
చంపించిన భార్య

అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..