
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
హుబ్లీ: బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే.బాలవీరారెడ్డికి ద్రోణాచార్య పురస్కార్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బెంగళూరులో న్యూ హోరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రజతోత్సవాల సందర్భంగా బాలవీరారెడ్డికి విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తిస్తు ద్రోణాచార్య పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు. ఆ విద్యా సంస్థ స్థాపకుడు డాక్టర్ మోహన్ మంగనాని మాట్లాడుతూ డాక్టర్ బాలవీరారెడ్డి విద్యా రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని, ఆయన ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని అభిలషించారు. ప్రముఖులు మధు పండిత్‌దాస్ ఇస్కాన్, ప్రొఫెసర్ టీజీ సీతారాం, రేణుకా మంగనాని, వైస్ చైర్‌పర్సన్, ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.
తల్లే మొదటి గురువు
హొసపేటె: తల్లే మొదటి గురువు, ఇంట్లో తల్లిదండ్రులు బోధించే సంస్కారం పిల్లలకు చాలా ముఖ్యం, దీనిని అందరూ అర్థం చేసుకుంటే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరవింద్ కులకర్ణి అన్నారు. గురువారం నగరంలోని ఫ్రీడం పార్క్‌లో పతంజలి యోగా సమితి జనని వివిధోద్దేశ సహకార సంఘం సహకారంతో నిర్వహించిన గురు పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేద వ్యాసుడు గొప్ప గురువు. మానవాళి ప్రయోజనం కోసం అఖండమైన, అనంతమైన వేదాలను రచించిన వ్యక్తి ఆయన అన్నారు. వేదాల సారాంశం ప్రజలకు మరింత సులభంగా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన 18 పురాణాలు, మహాభారతాన్ని రచించారన్నారు.
రిమ్స్‌లో శిశువుల
అపహరణ.. వ్యక్తి అరెస్ట్
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన కేంద్రంలో శిశువులను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి రిమ్స్‌లోకి వెళ్లి శరణప్ప చీర కట్టుకొని వార్డులో తిరుగుతున్న వ్యక్తిని విచారించారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో మార్కెట్ యార్డు పొలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
నగరసభ ఇంచార్జి
అధ్యక్షుడిగా సాజిద్ సమీర్
రాయచూరు రూరల్: నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించింది. అధ్యక్షురాలు నరసమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలల సెలవు పెట్టడంతో సమీర్ బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికల రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని రాజకీయ నేతలు విశ్లేషణల్లో చెప్పారు.
వైభవంగా గురు వందన ఉత్సవాలు
రాయచూరు రూరల్ : నగరంలో గురువందన ఉత్సవాలు వైభవంగా జరిపారు. గురువారం సోమవారపేటె మఠంలో గురు వందన కార్యక్రమాలను మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య నెరవేర్చారు. గురు పీఠానికి శిష్య గణం అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ నెరవేర్చారు. భక్తులు తులాభారం నిర్వహించారు. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తదితరులను సన్మానించారు.

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం