
ఉద్యోగాలు సృష్టించే నైపుణ్యాలు కలిగి ఉండాలి
బళ్లారిఅర్బన్: ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఏదైనా సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉంటారని హావేరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి అన్నారు. వీరశైవ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని రావ్ బహుదూర్ వై. మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కళాశాల 2025వ సంవత్సర స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి, మానవ సంప్నమూల కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు డాక్టర్.నారాయణ, కిర్లోస్కర్ పరిశ్రమ కొప్పళ మేనేజర్, ఆ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు బసవరాజ, డాక్టర్.అరవింద పాటిల్, బైలువద్దిగేరి ఎర్రిస్వామి, బాడద ప్రకాష్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీ.హనుమంతు రెడ్డి, డిప్యూటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సవితా సోనోలి, డీన్ పరీక్షల విభాగం కన్వీనర్ డాక్టర్ శ్రీపతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇంజనీరింగ్‌లో ఏదైన సాధించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. శ్రేష్టత, ఉత్సాహం, తెలివితేటలతో ఎంచుకున్న రంగంలో రాణించవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులకు నాంది పలికిందని, అయితే కొన్ని కొత్త సమస్యలు సృష్టించబడ్డాయన్నారు. విద్యార్థులు ఉద్యోగాలపైనే అధార పడకుండా ఉపాధి కల్పించే ఉద్యోగ దాతలు కావాలని ఆయన సూచించారు. పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు.
రావ్ బహుదూర్ వై.మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కళాశాల స్నాతకోత్సవంలో వక్తలు

ఉద్యోగాలు సృష్టించే నైపుణ్యాలు కలిగి ఉండాలి

ఉద్యోగాలు సృష్టించే నైపుణ్యాలు కలిగి ఉండాలి