
హడపద అప్పణ్ణ తత్వాలు ఆచరణీయం
బళ్లారి రూరల్ : ప్రతి ఒక్కరూ శివశరణ హడపద అప్పణ్ణ తత్వాలను అనుసరించాలని దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ్ విఠల్‌రావ్ తెలిపారు. ఆయన గురువారం దావణగెరె జెడ్పీ కార్యాలయంలో అప్పణ్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ సిద్ధాంతాలను, ప్రజలకు బోధించిన తత్వాలను ఆచరిస్తూ ప్రసిద్ధిగాంచిన అప్పణ్ణ మనందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు. దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, ఉపవిభాగాధికారి సంతోష్ పాటిల్, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర, దుడా సభ్యులు వాణి బక్కేశ్, బసాపుర శశిధర్ పాల్గొన్నారు.
గొప్ప పండితుడు హడపద అప్పణ్ణ
హొసపేటె: 12వ శతాబ్దపు గొప్ప పండితుడు, బసవణ్ణ సన్నిహితుడు హడపద అప్పణ్ణ అని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక సంస్కరణల కోసం కులం, మతం రంగు, వర్గం లేని సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారన్నారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారి సిద్దలింగేష్ తదితరులు పాల్గొన్నారు.
దావణగెరె జెడ్పీ సీఈఓ
గిత్తె మాధవ్ విఠల్‌రావ్

హడపద అప్పణ్ణ తత్వాలు ఆచరణీయం