
మనిషికేల భేదభావాలు?
చింతామణి: సూర్యుడు అందరికీ సమానంగా ఎండ ప్రసాదిస్తాడు, ప్రకృతికి భేదభావం లేదు, కానీ మానవునిలోనే భేదం వుంది, దీంతో మానవుడు సామరస్యంగా ఉండాలంటే గురుచింతన అవసరమని కై వార ధర్మాధికారి జయరాం అన్నారు. గురువారం కై వారం మఠంలో సంగీతోత్సవాలు మూడవ రోజుకు చేరుకోగా రాష్ట్రంతో పాటు తెలుగు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలు వచ్చారు. భగవంతుని నామస్మరణం చేయడం ద్వారా భక్తులు పావనమవుతారని యోగినారేయణ తాతయ్య కీర్తనల్లో బోధించారని గుర్తుచేశారు. గురు పూర్ణిమ కావడంతో యోగి నారేయణ తాతయ్య మూల విరాట్టుకు అభిషేకం, రాజోపచార తదితర సేవలను నిర్వర్తించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపనలు, సంగీత కచేరీలు భక్తులను మైమరిపించాయి.
యోగి నారేయణ తాతయ్య
బాటలో సాగుదాం

మనిషికేల భేదభావాలు?