
గుండెపోటుతో మహిళ మృతి?
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలోని ఒక దుకాణంలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. మృతురాలిని హరపనహళ్లి తాలూకాలోని దిద్దగితాండా నివాసి జయాబాయి(52)గా గుర్తించారు. ఆ మహిళ కుప్పకూలిన వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే జయాబాయి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు.
గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం
రాయచూరు రూరల్: గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా మలయాబాద్‌లో కేకేఆర్‌డీబీ నుంచి విడుదలైన రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో తాగునీటి సౌకర్యాల కల్పన పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో విద్య, అరోగ్య రంగాలకు ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆంజనేయలున్నారు.
నగరసభ అధ్యక్షుడిగా నియామకం
రాయచూరు రూరల్: నగరసభ అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం అనుమతించినట్లు సమాచారం.

గుండెపోటుతో మహిళ మృతి?

గుండెపోటుతో మహిళ మృతి?