
రేణుకాస్వామి హత్య తరహాలో కలబుర్గిలో దారుణహత్య
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్రదుర్గ జిల్లా రేణుకాస్వామి హత్య ఘటన మరువక ముందే అలాంటిదే ఓ హత్య కలబుర్గి జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కలబుర్గిలో అశ్వని అనే మహిళను రాఘవేంద్ర అనే వ్యక్తి వేధించడంతో ఆమె తన స్నేహితుడు గురురాజ్‌కు తెలియజేయడంతో గురురాజ్‌తో పాటు ఆయన ముఠా రాఘవేంద్ర(39)ను కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఏ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థినుల సత్తా
బళ్లారిటౌన్: గత నెలలో భారతీయ చార్టెర్డ్ అకౌంటెంట్స్ సంస్థ నిర్వహించిన సీఏ పరీక్షల ఫలితాలు ఈ నెల 5న విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో గ్రామీణ విద్యార్థినులు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సిరుగుప్ప తాలూకా హచ్చొళ్లికి చెందిన నీలమ్మ, బసవరాజ్ గౌడల పుత్రిక ఎం.శిల్ప, బళ్లారి తాలూకా బెళగల్‌కు చెందిన మమత, మంజునాథ్‌గౌడల పుత్రిక పవిత్ర సీఏ ఫైనలియర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించారు. వీరిరువురు కన్నడ మీడియంలోనే ప్రాథమిక, హైస్కూల్ విద్యను చదివి సీఏ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా వివిధ దశల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇక ఫైనలియర్‌లోను ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థినులను స్థానిక సీనియర్ చార్టెర్డ్ అకౌంటెంట్ సిరిగేరి పన్నారాజు అభినందించారు.

రేణుకాస్వామి హత్య తరహాలో కలబుర్గిలో దారుణహత్య