
రైల్వే స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించండి
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షణ మధ్య రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యులు డిమాండ్ చేిశారు. ఈమేరకు సభ్యులు చంద్ర శేఖర్, మారెప్ప, సిద్దలింగయ్య స్వామిలు శనివారం స్టేషన్ మేనేజర్‌తో సమావేశమై చర్చించారు. ఫ్లాట్‌ఫారంలో టైల్స్ తొలగిపోయాయని, వాటిని మార్చాలన్నారు. ప్లాట్‌ఫారంపై అపరిశుభ్రత నెలకొందని, లగేజి గది, మహిళల విశ్రాంతిగది, స్టేషన్‌లో కుక్కులు సంచరిస్తున్నాయన్నారు. దివ్యాంగులకు సదుపాయాలు లేవన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కొల్హాపూర్ రైలును పునః ప్రారం భించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు హేమరాజ గౌడ, అమరనాథ్ పాల్గొన్నారు.