లబ్ధిదారులతో బీజేపీ నేతల సమావేశం
బళ్లారిఅర్బన్: స్థానిక 21వ వార్డు బసవేశ్వర నగర్‌లో బీజేపీ ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనకు సంబంధించి మహాశక్తి కేంద్రం, అలాగే శక్తి కేంద్రాల కీలక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గత 11 ఏళ్లుగా మోదీ పాలనలో పేదలకు అట్టడుగు, మధ్య తరగతి వర్గాలకు చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్ మోత్కూర్, సురేఖ మల్లనగౌడ, వేమన్న, కేదార్‌నాథ్ స్వామి, రాధ, రత్నమ్మ, అనురాధ తదితర ప్రముఖులు, ఆ వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.


