
టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి
సాక్షి, బళ్లారి: అపార ఇనుప ఖనిజ నిల్వలున్న జిల్లాలోని సండూరు తాలూకాలో అతి వేగంతో వెళ్లే మైన్స్ టిప్పర్లతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలవుతుతున్నారు. విపరీతమైన వేగంతో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి పలువురు మృతి చెందుతున్నా అక్కడి పోలీసులు పట్టించుకోక మైన్స్ టిప్పర్ల వేగానికి అడ్డుకట్ట వేయకపోవటం వల్ల సోమవారం సండూరు తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సండూరు తాలూకా జైసింగాపుర సమీపంలో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తాలూకాలోని లక్ష్మీపుర గ్రామానికి చెందిన ఆశా(28), నిండు గర్భిణి జయలక్ష్మి(21)లతో పాటు చిన్నారులు బిందుశ్రీ (4), సాయి (9), కారు డ్రైవర్ నందీశ్ (29) అక్కడికక్కడే మృతి చెందారు. మహాలక్ష్మి(3) అనే చిన్నారితో పాటు మరో వ్యక్తి రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సండూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను నిర్వహించిన తరువాత హుబ్లీకి తరలించారు. కారులో చిన్నారులతో పాటు నిండు గర్భిణి వెళుతున్న సందర్భంలో అతి వేగంగా వస్తున్న ఇనుప ఖనిజం తరలిస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను సండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన సమాచారం తెలిసిన తక్షణమే అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల్లో నిండు గర్భిణీతో సహా చిన్నారులు
అతి వేగానికి అమాయకుల
ప్రాణాలు బలి
బళ్లారి జిల్లా సండూరు తాలూకాలో విషాదం

టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి

టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి

టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి