కమల్‌.. గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

కమల్‌.. గోల్‌మాల్‌

May 29 2025 9:45 AM | Updated on May 29 2025 9:45 AM

కమల్‌.. గోల్‌మాల్‌

కమల్‌.. గోల్‌మాల్‌

శివాజీనగర: ప్రముఖ బహుభాషా సినీనటుడు కమల్‌హాసన్‌ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడం తమిళం నుంచి పుట్టింది అని ఆయన చెప్పడం మీద కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళం నుంచే కన్నడ పుట్టిందా?

కమల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ కొద్దివారాల్లో విడుదల కానుంది, మంగళవారం చైన్నెలో జరిగిన సినిమా ప్రి– రిలీజ్‌ వేడుకలో కమల్‌ మాట్లాడుతూ, కన్నడం.. తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్‌ ప్రసంగాన్ని ఉయిరే, ఉరవే తమిళే.. అంటే నా జీవితం, నా బంధం అన్నీ తమిళమే అనే మాటలతో ప్రారంభించారు. వేదికపై ఉన్న కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ను చూస్తూ, ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివ రాజ్‌కుమార్‌) ఇక్కడికి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్‌ అని మొదలుపెట్టారు. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అని అన్నారు.

సంస్కృతి తెలియని వ్యక్తి: సీఎం

సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కన్నడ భాష సంస్కృతికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, పాపం కమల్‌కు ఆ విషయం తెలియదేమో అని హేళన చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కమల్‌ను సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కమల్‌హాసన్‌ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు. కమల్‌ హాసన్‌ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విజయేంద్ర డిమాండ్‌ చేశారు. ఆయన భాషా చరిత్రలో నిపుణుడు కూడా కాదని విమర్శించారు.

నిరసనలు

కన్నడ భాషా అభిమాన సంఘాలు కమల్‌పై మండిపడ్డాయి. బెంగళూరులో కమల్‌హాసన్‌ పోస్టర్లను చించి, దిష్టిబొమ్మను తగులబెట్టారు. కన్నడను చిన్నచూపు చూడటం తగదని హెచ్చరించాయి.

కన్నడ భాషను తక్కువ చేసేలా మాటలు

సీఎం, నేతలు సహా ప్రజల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement