
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో విపరీతంగా ఎండలు మండుతుండడంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యమవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలబుర్గిలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీలతో కూడిన హెల్మెట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొదటి సారిగా కలబుర్గిలో ఏసీ హెల్మెట్లను ప్రారంభించారు. రాయచూరు, బళ్లారి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, బీదర్, విజయ నగర జిల్లాల్లో 42–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్, మంత్రుల పర్యటనలు, ధర్నాలు ఇతరత్ర వాటిని చేపట్టిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఎండ వేడిమి నుంచి రక్షణ పొందడానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శరణప్ప నగరంలో 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఏసీ హెల్మెట్లు, 10 పొల్యూషన్ కంట్రోల్ మాస్క్, 140 రాత్రి వేళలో వెలుతురు ప్రసరించే దీపాలు, జాకెట్లను పంపిణీ చేశారు.
రాష్ట్రంలో మొదటిసారిగా
కలబుర్గిలో ప్రారంభం
వేసవి ఎండల నుంచి
ఉపశమనానికి చర్యలు