భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

Apr 19 2025 9:34 AM | Updated on Apr 19 2025 9:34 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

శివాజీనగర: క్రైస్తవులకు పవిత్ర దినమైన శుభ శుక్రవారం(గుడ్‌ ఫ్రైడే)ను రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా ఉపవాస, ధ్యాన, ప్రార్థనలతో ఆచరించారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రార్థన, ధ్యానం, యేసు శిలువ కార్యం, ఉపదేశం జరిగింది. శివాజీనగర సెయింట్‌ మేరీ బసలికా, ఎం.జీ.రోడ్డులో ఉన్న సెయింట్‌ మార్క్స్‌ క్యాథడ్రల్‌ చర్చి, ఆల్‌ పీపల్స్‌ చర్చి, సెయింట్‌ థామస్‌ చర్చి, ఇన్ఫాంట్‌ జీసస్‌ చర్చి, సెయింట్‌ లుక్స్‌ చర్చి, సెయింట్‌ ప్యాట్రిక్‌ చర్చి, శివాజీనగర ఫ్రాన్సిస్‌ జేవియర్‌ చర్చి, శిశు జీసస్‌ చర్చి వివేకానగర, మిస్పా తెలుగు చర్చి, మరియమ్మనహళ్లి కర్ణాటక కల్వరి చర్చి, అమాన్‌ తెలుగు చర్చితో పాటు పలు చోట్ల గుడ్‌ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చర్చి వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం చేశారు. భక్తులు ఇళ్లలో నుంచే ఆచరణలో పాల్గొన్నారు. యేసును గొల్గొతా కొండకు తీసుకెళ్లిన ఆనాటి దృశ్యాలను, యేసు క్రీస్తు శిలువను మోసుకొని ఊరేగించిన దృశ్యాలను కూడా ప్రదర్శించారు.

ఏడు దివ్య వాక్కులు క్రీస్తు సందేశం:

ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని మననం చేసుకుంటూ క్రైస్తవులు శిలువపై యేసు పలికిన ఏడు దివ్య వాక్కులను అత్యంత భక్తిశ్రద్ధలతో ధ్యానించారు. గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని గత 40 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనల్లో నిమగ్నమైన క్రైస్తవులు శుక్రవారం ఆయా చర్చిల్లో గుడ్‌ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అత్యంత భక్తితో ఉపవాసంలో ఉంటూ చర్చిల సభ్యులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భక్తిపాటలను ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. ఫ్రేజర్‌టౌన్‌లో ఉన్న మిస్పా తెలుగు చర్చి, మారతహళ్లి అమానా తెలుగు చర్చి, రామచంద్రపుర, మత్తికెరె, హలసూరు తదితర ప్రాంతాల్లోని చర్చిల్లో యేసు సిలువపై పలికిన ఏడు మాటలను ప్రత్యేకంగా ధ్యానించారు. మానవులు క్షమా గుణం కలిగి జీవించాలని యేసు తెలియజేసిన మాటలను వివరించారు. మిస్పా తెలుగు చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ బెరాకా ఆండీ ప్రత్యేక ప్రార్థన చేశారు. పరిశుద్ధ బైబిల్‌ గ్రంథంలో లిఖించిన ఏసు శిలువపై పలికిన ఏడు మాటలను ఏడుగురు పాస్లర్లు విశదీకరించారు. శిలువ శ్రమలను అనుభవిస్తూ తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండని యేసు పలికిన మొదటి మాట గురించి పాస్టర్‌ రెవరెండ్‌ డీ.బెరాకా ఆండీ వివరించారు. ఏసు క్రీస్తు సర్వమానవాళికి పాప విముక్తి కలిగించారని అమాన తెలుగు చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ కే.పీ.రాజశేఖర్‌ తెలియజేశారు.

శిలువపై ఏసుక్రీస్తు

పలికిన ఏడు మాటలను

ధ్యానించిన క్రైస్తవులు

చర్చిల్లో సామూహిక ప్రార్థనలు

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే1
1/4

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే2
2/4

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే3
3/4

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే4
4/4

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

Advertisement
 
Advertisement
Advertisement