భార్యకు గర్భం.. భర్తకు జైలు | - | Sakshi
Sakshi News home page

భార్యకు గర్భం.. భర్తకు జైలు

Jun 19 2024 1:00 AM | Updated on Jun 19 2024 9:46 AM

-

 మైసూరు: మైసూరు జిల్లాలోని హెచ్‌డి కోటె తాలూకాలోని బూదనూరు హాడి గ్రామానికి చెందిన నాగేష్‌ (25) అనే యువకుడు ఆదే గామానికి చెందిన మైనర్‌ బాలికను పెళ్ళి చేసుకున్నాడు, బాలిక ఇటీవల గర్భం దాల్చడంతో విషయం పోలీసులకు చేరి భర్తపై పోక్సో కేసు పెట్టారు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (16)తో నాగేష్‌కు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అన్నూరు పిహెచ్‌సీలో వైద్య పరీక్షల కోసం వెళ్లింది. వైద్యురాలు బాలికకు ఇంకా మైనారిటీ తీరలేదని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్లు నిండాకుండా పెళ్లి చేయడం, గర్భవతిని చేయడం చట్ట విరుద్ధం కాబట్టి, పోలీసులు నాగేష్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement