శివాజీనగర: నమ్మ మెట్రోలో నిబంధనలు పాటించలేదంటూ 10.76 లక్షల మంది ప్రయాణికులనుంచి బీఎంఆర్‌సీఎల్ 11 నెలల వ్యవధిలో సుమారు రూ.5.38 కోట్లు వసూలు చేసింది. నమ్మ మెట్రోలో భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు నిబంధనలు అమలు చేస్తోంది. గత వారం విజయనగర మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు 20 నిమిషాల పాటు అదనంగా వేచి ఉన్నందుకు రూ.50 జరిమానా విధించారు. ఇలా గత జూన్ నుంచి ఇప్పటి వరకు మెట్రో స్టేషన్‌లో అధిక సమయం వేచి ఉన్న 10.75 లక్షల మందికి రూ.50 చొప్పున జరిమానా విధించి రూ.5.38 కోట్లు వసూలు చేశారు. ప్రయాణికులు అనవసరంగా అధిక సమయం స్టేసన్‌లో గడిపితే ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో 20 నిమిషాలకు పైగా సమయం అదనంగా గడిపితే జరిమానా విధిస్తున్నారు.
సుమారు రూ. 5.38 కోట్లు వసూలు చేసిన బీఎంఆర్‌సీఎల్