
పీయూఐ చెల్లింపు క్యూఆర్ కోడ్, పక్కనే సంస్థ ఎండీ భరత్(ఫైల్)
హుబ్లీ: వ్యాయువ ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపులకు(నగదు రహిత ప్రయాణం) ప్రయాణికులనుంచి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ సౌకర్యాన్ని హుబ్లీ గ్రామాంతర డివిజన్ బస్సులకు ఏర్పాటు చేశారు. త్వరలోనే సంస్థ అన్ని బస్సులకు విస్తరిస్తామని సంస్థ ఎండీ భరత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫోన్‌పే సహకారంతో యూపీఐ ద్వారా టికెట్‌కు సరిపడు డబ్బు స్వీకరించడానికి గ్రామీణ ప్రాంతాలలోన్ని అన్ని బస్సులకు అవకాశం కల్పించామన్నారు. దీంతో చిలర్ల బాధలు తప్పుతాయన్నారు. ప్రతి కండెక్టర్‌కు ఫోన్‌పే సదుపాయం ఉన్న అత్యధునిక యంత్రం అందిస్తామన్నారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడానికి అవకాశం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 71,60, 337 లావాదేవీలు జరిగాయన్నారు. ప్రస్తుతం హుబ్లీ రూరల్ డివిజన్‌లో 452 బస్సులకు విస్తరించామన్నారు. సంస్థలోని మొత్తం బస్సులకు 4581 బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment