
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ విరుపాక్షప్ప
కంప్లి: వేళకు సరిగా బస్సు సౌకర్యం కల్పించాలని ఒత్తిడి చేస్తూ దమ్మూరు, కగ్గల్ విద్యార్థులు గురువారం కోళూరు క్రాస్ వద్ద రాస్తారోకో చేశారు. సుమారు 350 మందికి పైగా విద్యార్థులు నిత్యం ఉదయం కోళూరు క్రాస్‌కు చేరి బళ్లారి, సిరుగుప్ప తదితర ప్రాంతాలకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తుంటారు. దమ్మూరు, కగ్గల్ గ్రామాల్లో పీయూసీ, డిగ్రీ చదివే విద్యార్థులు 250 మంది ఉండగా నిత్యం బళ్లారి వైపు విద్యాభ్యాసానికి వెళ్తుంటారని ఆందోళనకారులు అన్నారు. విషయం తెలిసిన కురుగోడు ఎస్‌ఐ విరుపాక్షప్ప ఘటన స్థలానికి చేరి అధికారులతో మాట్లాడి ఇకపై బస్సు సమస్య రాకుండా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి, శంకర్, రాజశేఖర్, శివకుమార్, అశోక్, బసవ, యంకప్ప, రాజశేఖర్, సిద్దార్థ, పవన్‌కుమార్‌లు పాల్గొన్నారు.