
బనశంకరి: ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని ఓ వ్యాపారవేత్త నుంచి వసూళ్లు చేసిన కేసులో ప్రధాన నిందితురాలు చైత్రా కుందాపుర నుంచి రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వంచన కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్‌చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. అలాగే మరో నిందితుడు అభినవ హాలశ్రీ మఠంలో రూ.56 లక్షల నగదు, అతని వద్ద రూ.20 లక్షలు స్వాదీనం చేసుకున్నామన్నారు. ప్రణవ్‌ప్రసాద్, తిప్పేస్వామితో పాటు నలుగురికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీచేశారన్నారు. బాధితుడు గోవిందబాబు పూజారి నుంచి తీసుకున్న రూ.3.50 కోట్ల నగదును చైత్రా కుందాపుర, శ్రీకాంత్ తదితరులు పంచుకుని పలుచోట్ల పెట్టుబడులు పెట్టారని, బ్యాంకుల్లో దాచుకున్నారని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లోని నగదును సీజ్ చేసినట్లు చెప్పారు.