
కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ గాయకులు, కవులు
కోలారు: ప్రముఖ విప్లవ గాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు స్వర్గీయ ప్రజాకవి గద్దర్‌కు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నగరంలోని నచికేత నిలయంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది గాయకులు పాల్గొని గద్దర్ జ్ఞాపకార్థం విప్లవ గీతాలను ఆలపించారు. కవులు కావ్యాలు చదివారు. ఈ సందర్భంగా కవి గొల్లహళ్లి శివప్రసాద్ మాట్లాడుతూ గద్దర్ ఆశు కవి అని, సందర్భానుసారంగా పాటలు పాడేవారన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేడు వేల సంఖ్యలో గాయకులు పుట్టుకొచ్చారన్నారు. కార్యక్రమంలో సీనియర్ గాయకులు ఎస్.మునిస్వామి, హైదరాబార్ విమలక్క, కవి గోష్టిలో హులికుంటె మూర్తి, కాగతి వెంకటాచలపతి, వికాస్ ఆర్.మౌర్య, డాక్టర్ కె.వి.నేత్రావతి తదితరులు పాల్గొన్నారు.
బాలాంజనేయ స్వామి
హుండీ లెక్కింపు
గంగావతి: తాలూకాలోని ఆనెగుంది సమీపంలో అంజనాద్రి బెట్టపై వెలిసిన బాలాంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో రూ.31,75,385 కానుకలు లభించాయి. రెవెన్యూ శాఖ అధికారులు ఈ హుండీని ఉదయాన్నే తెరచి సాయంత్రం వరకు లెక్కించారు. 43 రోజులకు గాను ఈ సొమ్ము హుండీలో లభ్యమైనట్లు గ్రేడ్– 2 తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అమెరికా ఇతర పలు దేశాల కరెన్సీ హుండీలో లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సొమ్మును సణాపురలోని దేవస్థాన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఆర్‌ఐ మహేష్ దలాల్, మహబూబ్ వలీ, కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.

హుండీలోని సొమ్మును లెక్కిస్తున్న దృశ్యం