
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రముఖులు
బళ్లారిఅర్బన్: తెలుగు చలనచిత్ర సీమలో తనదైన శైలిలో ప్రముఖ నటుడుగా, ధృవతారగా అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్‌ఆర్) గుర్తింపు పొందారని రాఘవ మెమోరియల్ అసొసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన బుధవారం రాఘవ కళా మందిరంలో సమతా సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. పల్లెటూరి నుంచి నాలుగో తరగతి వరకు మాత్రమే చదివి వచ్చిన నాగేశ్వరరావు సినీ రంగంలో అద్భుత నటనతో రాణించారన్నారు. కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు ట్రస్ట్ అధ్యక్షులు సురేంద్రబాబు, తెలుగు సంస్కృతి సంఘం అధ్యక్షులు గాదెం గోపాలకృష్ణ, ట్రస్ట్ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు పొందిన రమేష్‌గౌడ పాటిల్, ఎం.రామాంజినేయులను సన్మానించగా, అక్కినేని పాటలతో కాళిదాసు ఆకట్టుకున్నారు. జీఆర్ వెంకటేశులు, కే.ప్రభాకర్, వెంకటేష్, బాలరెడ్డి, రమేష్‌రెడ్డి, మాలవీలత, రాజసింహా, ఎన్.బసవరాజ్, అడవిస్వామి, రమణప్ప తదితరులు పాల్గొన్నారు.