హుబ్లీ: వినాయక చవితి ఉత్సవాల వేళలో దోపిడీ దొంగలు హుబ్లీలో చెలరేగిపోయారు. సుమారు రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు నగదును దోచుకొని పరారయ్యారు. బసవేశ్వర నగర్ లక్ష్మీ లేఔట్‌లో విద్యామందిర బుక్ డిపో యజమాని ఉల్లాస దొడ్డమని అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ చోరీ జరిగింది. సుమారు 8 మంది దోపిడీ దొంగల ముఠా ఇంటి కిటికీ చువ్వలను విరగకొట్టి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న వారి కాళ్లు, చేతులు కట్టి వేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. స్థానిక గోకుల్ రోడ్డు పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.