
వినాయకుల ఊరేగింపు
● కన్నుల పండువగా నిమజ్జన ఘట్టం
కెలమంగలం, క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లాలో గురువారం వినాయక నిమజ్జన వేడుక అట్టహాసంగా సాగంది. గురువారం తాలూకా కేంద్రం సూళగిరి, డెంకణీకోటలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి వినాయక ప్రతిమలను ట్రాక్టర్లలో ఉంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. యువకులు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ వినాయకులను ఊరేగించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నేతృత్వంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిమజ్జనం చేస్తున్న దృశ్యం
